: హైదరాబాదులో రాజీవ్ గాంధీ 23వ వర్ధంతి కార్యక్రమం
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 23వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. పంజాగుట్టలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.