: ఇద్దరు దోషులకు మరణశిక్ష నుంచి విముక్తి
కోల్ కతా నగరంలోని అమెరికన్ సెంటర్ పై 2002 జనవరిలో దాడికి పాల్పడిన ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు మరణశిక్ష నుంచి విముక్తి కల్పించింది. దిగువ కోర్టు విధించిన మరణశిక్షను జీవితకాల శిక్షగా సుప్రీం ధర్మాసనం మార్పు చేసింది. నాటి దాడిలో నలుగురు పోలీసులతోపాటు మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఐదుగురికి జైలు శిక్ష, ఇద్దరికి మరణశిక్షను విధిస్తూ ట్రయల్ కోర్టు లోగడ తీర్పునిచ్చింది. దాన్ని కలకత్తా హైకోర్టు సమర్థించింది. తాజాగా వారికి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది.