: మోడీ ప్రసంగానికి ముగ్దుడైన శశిథరూర్
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్రమోడీ చేసిన ప్రసంగం అందరినీ కట్టిపడేయగా, ఆ జాబితాలో కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. మోడీ ప్రసంగం తనను ఎంతో ఆకట్టుకుందని మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ తెలిపారు. ఓపికతో, కలుపుకుపోయే తనంతో ఆయన చేసిన ప్రకటనలకు ముగ్దుడినయ్యానని, అలానే ఇక ముందు కూడా ఉండి, దేశ ప్రజలందరి ప్రయోజనాల కోసం పని చేయాలని ఆకాంక్షించారు.