: ఖమ్మం జిల్లాలో సెల్ టవర్ పేల్చేసిన మావోలు
మావోయిస్టులు మరోసారి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఖమ్మం జిల్లాలోని దుమ్మగూడెం మండలం కొత్తపల్లిలో ఈ తెల్లవారుజామున సెల్ టవర్ ను పేల్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు ప్రారంభించారు. మావోల కోసం కూంబింగ్ పార్టీలు అడవిలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.