: ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం... క్షమించండి: కేజ్రీవాల్


ఏదో చేద్దామనుకున్నారు... మరేదే జరిగిపోయింది. కట్ చేస్తే... ఇప్పుడు ఆ పార్టీ ఊసెత్తేవారు కూడా లేరు. దేశ గతిని మార్చేస్తారనే నమ్మకంతో కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దాంతో, ఆప్ ఉప్పెనలా ఎగసింది. కానీ, స్వయంకృతాపరాధాలు ఆ పార్టీని పతనం దిశగా నడిపించాయి. తప్పు మీద తప్పు చేస్తూ ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎంతో నమ్మకంతో తమకు అధికారాన్ని కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రజల అంచనాల మేరకు పనిచేయలేకపోయామని ఒప్పుకున్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోవడం అతి పెద్ద పొరపాటు అని ఒప్పుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కనుక... ఎన్నికలకు వెళతామని చెప్పారు. అయితే దేశం యావత్తూ మోడీ మాయలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీలో బీజేపీని ఆప్ ఢీ కొనగలదా? అనేది మిలియన్ డాలర్స్ క్వశ్చన్!

  • Loading...

More Telugu News