: మారుతి జిప్సీకి ఆర్మీ గుడ్ బై


27 సంవత్సరాల పాటు భారతీయ సైన్యానికి విశేష సేవలందించిన మారుతి జిప్పీ త్వరలో టాటా చెప్పనుంది. కొండ ప్రాంతాలలో, రోడ్డు వసతి లేని చోట కూడా సైనికులకు సేవలందించిన ఈ వాహనం స్థానంలో శక్తిమంతమైన మరో వాహనాన్ని ప్రవేశ పెట్టాలని సైన్యం భావిస్తోంది. టాటా సఫారీ, మహీంద్రా స్కార్పియోలో ఏదైనా ఒకదానిని తీసుకోవచ్చని సైన్యం వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి టాటా, మహీంద్రాలు తమ ప్రతిపాదనలను ఈ నెల 15నాటికి సమర్పిస్తాయని తెలిపాయి. ఈ నిర్ణయంతో సైన్యంలో పనిచేస్తున్న 30వేల జిప్సీలు కనుమరుగు కానున్నాయి. 

  • Loading...

More Telugu News