: అమెరికాలోని ఏఆర్ రెహమాన్ ఇంటిపై దాడి
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో రెహమాన్ ఇష్టపడి కట్టించుకున్న భవనాన్ని స్వల్పంగా ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని రెహమాన్ ట్విట్టర్లో తెలిపారు. అమెరికాకు వెళ్లినప్పుడు రెహమాన్ ఈ ఇంట్లోనే ఉంటారు.