: ఆమ్ ఆద్మీకి మద్దతిచ్చేది లేదు: కాంగ్రెస్


ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ కుండ బద్దలు కొట్టింది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని 'ఏఏపీ'కు ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడానికి సిద్ధమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఏఏపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ చీఫ్ అవిందర్ సింగ్ లవ్వీ స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఏఏపీకి 27, కాంగ్రెస్ పార్టీకి 8 మంది సభ్యులున్నారు.

  • Loading...

More Telugu News