: ఏ రాజకీయ పార్టీతోనూ గవర్నరుకు సంబంధం ఉండదు: హెచ్.ఆర్.భరద్వాజ
గవర్నర్ రాజ్యాంగ పదవి అని, ఏ రాజకీయ పార్టీతోనూ గవర్నరుకు సంబంధం ఉండదని కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ అన్నారు. తాను పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం కోరుకుంటోందని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు.
తనను రాష్ట్రపతి నియమించారని భరద్వాజ అన్నారు. రాష్ట్రపతి భవన్ కొత్త గవర్నరును నియమించే వరకు రాష్ట్రాన్ని వదిలిపొమ్మని ఆదేశించే అధికారం ఎవరికీ లేదన్నారు. భరద్వాజ పదవీ కాలం జూన్ 29వ తేదీతో ముగియనుంది.