: ఎన్డీయే మంత్రివర్గంలో చేరుతున్నాం: చంద్రబాబు


నరేంద్ర మోడీ ప్రధాని కావడం దేశానికి శుభసూచికమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మోడీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యారని, మోడీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని రాష్ట్రపతి ఆహ్వానించారని చంద్రబాబు చెప్పారు. మోడీ పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని ఆయన అన్నారు. పదేళ్ల యూపీఏ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందన్నారు.

కేంద్రంలో ఎన్డీయే మంత్రివర్గంలో చేరుతున్నామని చంద్రబాబు తెలిపారు. అయితే, పదవుల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కుట్ర రాజకీయాలపై స్పష్టమైన తీర్పు వచ్చిందన్నారు. టీడీపీకి పూర్వ వైభవం వస్తోందని ఆయన అన్నారు. సీమాంధ్రను పునాది స్థాయి నుంచి నిర్మించాలని చంద్రబాబు చెప్పారు. అలాగే, సామాజిక తెలంగాణ కోసం నిర్మాణాత్మకంగా పనిచేస్తామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News