: భారత్ లో అత్యధికంగా మార్కెట్ ఉన్న క్రీడాకారుడు విరాటే!
పిన్న వయస్సులోనే క్రికెట్ లో రాణిస్తున్న విరాట్ కోహ్లీ పాప్యులారిటీ రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా భారత్ లో అత్యధికంగా మార్కెట్ కలిగిన క్రీడాకారుడు కోహ్లీయేనని యూకేకు చెందిన ప్రముఖ 'స్పోర్ట్స్ ప్రో' మ్యాగజైన్ బల్లగుద్ది చెబుతోంది. మొదటి స్థానంలో బ్రిటీష్ ఫార్ములా వన్ రేసర్ లెవిస్ హామిల్టన్ నిలిచాడని తెలిపింది. మార్కెట్ లో ఉన్న సామర్థ్యం ఆధారంగా సదరు పత్రిక యాభై మంది క్రీడాకారులతో ఓ జాబితా రూపొందించింది. వచ్చే మూడేళ్ల వరకు డబ్బు, వయసు, చరిష్మా పలు అంశాల విలువ ఆధారంగా వారిని జూన్ ఎడిషన్ కు ఎంచుకుంది. ఇందులో భారత్ నుంచి విరాట్ ఒక్కడే ఉండటం గమనార్హం. ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్ మెన్, ఢిల్లీ డేర్ డెవిల్స్ స్కిప్పర్ కెవిన్ పీటర్సన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు.