: రాజపక్సే పర్యటనకు నిరసన సెగలు.. తిరుమలలో 144 సెక్షన్


భారత పర్యటనకు రానున్న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు తమిళుల నిరసన సెగలు తాకనున్నాయి. తిరుమల శ్రీవారిని ఈ రోజు రాజపక్సే దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో రాజపక్సే రాకను వ్యతిరేకిస్తూ తమిళులు వేలాదిగా తిరుపతికి చేరుకుంటున్నారు. ఇప్పటికే తమిళ ప్రజా సంఘాల నేతలు తిరుపతికి వచ్చారు.

శ్రీలంకలో 
వేలాది మంది తమిళులను ఊచకోత కోసిన రాజపక్సేకు తమ నిరసన తెలిచేయాలని వీరి వ్యూహం. రాజపక్సే పర్యటనను నిరసిస్తూ తిరుపతి పట్టణంలో పోస్టర్లు వెలిశాయి. దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తిరుపతి పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ముందస్తుగా 200 మంది తమిళులను అదుపులోకి తీసుకున్నారు.

రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకు భారీగా పోలీసులను మోహరించారు.

మరోవైపు రాజపక్సే పర్యటనను వ్యతిరేకిస్తూ ఎండీఎంకే నేత వైగో, ఆ పార్టీ నేతలు డిల్లీలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 'రాజపక్సే గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోనూ పలు పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. డీఎంకే తరఫున కరుణానిధి, స్టాలిన్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

రాజపక్సే ఈ రోజు, రేపు భారత్ లో పర్యటిస్తారు. తొలిరోజు తిరుమల వస్తుండగా, రేపు బీహార్లోని బుద్ధగయలో బౌద్ధారామాన్ని దర్శిస్తారు. 

  • Loading...

More Telugu News