: హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కి ఊరట
హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి సల్మాన్ కు అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు. సల్మాన్ మద్యం తాగినట్లు తాను గుర్తించలేదని అతడు కోర్టులో తెలిపాడు. అంతేకాదు, అతని వద్ద మద్యం వాసన ఏ మాత్రం రాలేదని కూడా చెప్పాడు. దాంతో ఈ కండల వీరుడికి శిక్ష అవకాశాలు చాలావరకు తగ్గిపోయినట్లే.