: దేశీయ విమాన ప్రయాణాల్లో 4.75 శాతం వృద్ధి


దేశీయ విమాన ప్రయాణాల్లో 4.75 శాతం వృద్ధి నమోదైంది. ఏప్రిల్ లో డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య 53.18 లక్షలున్నట్లు భారత విమానయాన శాఖ వెల్లడించింది. గతేడాది ఏప్రిల్లో ఈ సంఖ్య 50.77 లక్షలుగా ఉంది. అలాగే ఈ సంవత్సరం జనవరి - ఏప్రిల్ మాసాల మధ్యలో ప్రయాణాల్లో 2.02 శాతం వృద్ధి నమోదైంది. 206.99 లక్షల మంది దేశీయ విమానయాన సేవలను వినియోగించుకున్నారు.

దేశీయంగా ఉన్న విమానయాన సంస్థల్లో ఎయిర్ కోస్టా 77.8 శాతంతో అత్యధిక అక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ఆ తర్వాత ఇండిగో 76.9 శాతం, గో-ఎయిర్ 76.1 శాతం అక్యుపెన్సీ నమోదు చేసుకొన్నాయి. ఆ తర్వాత స్థానాలను జెట్ లైఫ్ (76), స్పైస్ జెట్ (73.3), ఎయిర్ ఇండియా (73.3) దక్కించుకున్నాయి.

  • Loading...

More Telugu News