: చంద్రబాబు ఆదేశిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి చేపడతా: గంటా
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి చేపడతానని, లేదంటే కార్యకర్తగానే పార్టీకి సేవ చేస్తానని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ముఖ్యమంత్రిగా విజయవాడ లేదా తిరుపతిలో ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలిపారు.