: బీజేపీ ఘన విజయం మోడీకే దక్కుతుంది: అద్వానీ


2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం నరేంద్రమోడీకే దక్కుతుందని అగ్రనేత ఎల్ కే అద్వానీ చెప్పారు. మోడీ ప్రభంజనం వల్లే బీజేపీ ఇంతటి విజయాన్ని సొంతం చేసుకోగలిగిందన్నారు. దేశ ఆకాంక్షలను మోడీ నేరవేరుస్తారన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరుగుతున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పైవిధంగా మాట్లాడారు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని చారిత్రాత్మక ఘట్టాలు, పరిణామాలు ఉంటాయని, తన జీవితంలో ఈ రోజు ప్రసంగం కూడా ఆ కోవలోకే చెందుతుందని అద్వానీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News