: అత్యిధికంగా ఓట్లు నమోదు కావడం ఇదే తొలిసారి: రాజ్ నాథ్ సింగ్


స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ తర్వాత బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. దేశ చరిత్రలో అత్యధికంగా ఓట్లు నమోదు కావడం కూడా ఇదే ప్రథమం అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసిందన్నారు. 15వ లోక్ సభ వరకు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండేదని గుర్తు చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. ఈ రోజు చరిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. సుపరిపాలనే తమ అజెండా అని ఆ నినాదంతోనే ముందుకెళతామన్నారు. స్వావలంబన, ఆర్థిక స్థిరత్వం ఉన్న దేశాభివృద్ధే లక్ష్యమని తెలిపారు.

  • Loading...

More Telugu News