: శృతిహాసన్ ఫిర్యాదుతో ఫొటోగ్రాఫర్ల విచారణ
శృతిహాసన్ నటించిన 'ఎవడు' సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలను అనుమతి లేకుండా వెబ్ సైట్లలో పెట్టడంపై హైదరాబాద్ సీఐడీ పోలీసులు ఫొటోగ్రాఫర్లను విచారిస్తున్నారు. గత రెండు రోజుల్లో సుమారు 10 మంది ఫొటోగ్రాఫర్లను విచారించారు. ఫొటోలు ఎవరు ఇచ్చారు? అనుమతి లేకుండా ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. సినిమా నిర్మాతతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా తన ఫొటోలు బయటకు రావడంపై శృతి హాసన్ కొన్ని రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు.