: మోడీ పేరును ప్రతిపాదించిన అద్వానీ... బలపర్చిన వెంకయ్య, గడ్కరీ
ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరుగుతున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంటరీ నేతగా నరేంద్రమోడీ పేరును పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను మురళీ మనోహర్ జోషి, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ బలపర్చారు. ఇదే క్రమంలో మోడీ పేరుకు పలువురు పార్టీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, అత్యంత ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమం జరుగుతోంది.
అనంతరం పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికైన మోడీని రాజ్ నాథ్ సింగ్, అద్వానీ, జోషి, వెంకయ్య, సుష్మ, అరుణ్ జైట్లీ, శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ రమణ్ సింగ్, నితిన్ గడ్కరీ, వసుంధరా రాజే, మనోహర్ పారిక్కర్, పలువురు పూలబొకేలతో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.