: పమేలాపై 12 ఏళ్ల వయసులో సామూహిక అత్యాచారం


బేవాచ్ కార్యక్రమం స్టార్ పమేలా అండర్సన్ చిన్న వయసులోనే లైంగిక దాడులకు గురైందట. ఈ విషయాన్ని కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ వేదికగా ఆమె వెల్లడించింది. '6 ఏళ్ల వయసున్నప్పుడు నా సంరక్షణ చూసే ఆయా చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యాను. 12 ఏళ్ల వయసులో నా బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను. ఆ ఫ్రెండ్ అన్నయ్య నాకు ఆట నేర్పుతానంటూ అత్యాచారం చేశాడు. అదే నా తొలి అనుభవం. అతడికి 25 ఏళ్ల వయసు అప్పుడు. ఆ తర్వాత నా మాజీ బోయ్ ఫ్రెండ్, అతడి స్నేహితులు కలసి నాపై సామూహిక అత్యాచారం చేశారు' అంటూ తానెదుర్కొన్న కష్టాలను వివరించింది. దీంతో మనుషులపై నమ్మకం పోయిందన్నారు. జంతువుల సంరక్షణే తన లోకంగా చెప్పింది.

  • Loading...

More Telugu News