: ఖమ్మం జిల్లా ఇల్లెందులో సీఎం పర్యటన


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి  ఇల్లెందు మండలంలోని కొత్తూరుకు 2.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ గిరిజనులతో మాట్లాడిన తర్వాత తిరిగి కారులో బయల్దేరి ఇల్లెందు పట్టణంలోని జేకే కాలనీకి చేరుకుని, సింగరేణి హైస్కూల్ లో ఎస్సీ, ఎస్టీ పైలాన్ ను ఆవిష్కరిస్తారు. 3.15 గంటలకు సీఈఆర్ క్లబ్ గ్రౌండ్స్ లో జరిగే బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలలో పాల్గొని, తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అనంతరం తిరిగి హైదరాబాద్ కు బయల్దేరతారు. ముఖ్యమంత్రి వెంట కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రులు రాంరెడ్డి వెంకటరెడ్డి, బాలరాజు, పితాని సత్యన్నారాయణ, బొత్స సత్యన్నారాయణ పాల్గొంటారు. 

  • Loading...

More Telugu News