: బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా జీతన్ రామ్ మంజి


ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా చేయక తప్పలేదు. దాంతో బీహార్ కొత్త సీఎంగా జీతన్ రామ్ మంజి ఎన్నికయ్యారు. నితీశ్ తన రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అనడంతో చివరికి జనతాదళ్ యునైటెడ్ పార్టీ మంజిని ముఖ్యమంత్రిగా నియమించింది. మక్దూమ్ పురా నుంచి మంజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం బీహార్ సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేస్తున్నారు.

అంతకు ముందు నితీశ్ మంజిని వెంటబెట్టుకుని వెళ్లి గవర్నరును కలిశారు. ఆ తరువాత తన స్థానంలో మంజి ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించారు. ఎన్డీయే కూటమి నుంచి జనతాదళ్ వేరుపడ్డ తర్వాత జరిగిన ఎన్నికల్లో మొత్తం నలభై స్థానాల్లో జేడీయూ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. బీజేపీ నుంచి వేరుపడాలని నితీశ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన శరద్ యాదవ్ వర్గం ఆయన రాజీనామాను కోరింది. అయితే తన అనుచరుడినే సీఎంగా చేసి నితీశ్ పై ఎత్తు వేశారు. మరో వైపు 2015 ఎన్నికల్లో పార్టీ మళ్లీ విజయం సాధిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని కూడా నితీశ్ తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News