: గవర్నర్ నరసింహన్ తో ముగిసిన చంద్రబాబు భేటీ


రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని అన్నారు. విభజన అనంతరం తెలుగువారు అభివృద్ధితో ముందడుగు వేయాలన్నారు. తాను చేసిన అభివృద్ధి వల్లే తెలంగాణలో మిగులు బడ్జెట్ వచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. తెలంగాణ జేఏసీ నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడినందువల్లే గతంలో పెట్టుబడులు వెనక్కి వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హైదరాబాదులో గానీ, తెలంగాణలోగాని ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని అన్నారు. రెండు ప్రాంతాల అభివృద్ధి పట్ల టీడీపీకి బాధ్యత ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News