: ఆ ట్వీట్ షారుఖ్ ఖాన్ కు షాకిచ్చింది!
ఒక్క ట్వీట్ బాలీవుడ్ బాద్ షాకు షాకిచ్చింది. అయితే, ఆ ట్వీట్ తానివ్వలేదని, ఎవరో తన పేరిట నకిలీ ట్వీట్ ను పంపించారంటూ షారుక్ వివరణతో ట్విట్టర్ ద్వారానే మరో ట్వీట్ ఇవ్వాల్సి వచ్చింది. అంతలా షారుక్ ను షేక్ చేసిన ఆ ట్వీట్ లో ఏముందా? అనే కదా మీ సందేహం. ‘నరేంద్ర మోడీ ప్రధాని అయితే ట్వీట్టర్ నే కాదు, ఏకంగా నేనీ దేశాన్నే వదిలేస్తాను’ అని ఉంది. దాంతో షారుఖ్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇప్పుడు మోడీ ప్రధాని అయ్యారు కాబట్టి దేశాన్ని వదిలిపొమ్మంటూ ఆయనపై ట్వీట్ల బాణాలు వందలకొద్దీ వచ్చి పడుతున్నాయి. దీంతో కంగుతిన్న షారూక్ అసలు తానీ ట్వీట్ ను ఇవ్వలేదని, ఈ ట్వీట్ కు, తనకు సంబంధం లేదని అన్నారు.