: సుబ్రతారాయ్ కు మళ్లీ బెయిల్ నిరాకరణ
సహార సంస్థల ఛైర్మన్ సుబ్రతారాయ్ కు సుప్రీంకోర్టు మళ్లీ బెయిల్ నిరాకరించింది. ఇదే సమయంలో తన కస్టడీని హౌస్ అరెస్టుగా మార్చాలంటూ చేసిన అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. సంస్థలో పెట్టుబడి పెట్టిన మదుపుదారులకు ఇవ్వాల్సిన నగదు విషయంలో నిర్లక్ష్యం వహించిన సుబ్రతారాయ్ ను మార్చిలో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి తీహార్ జైల్లో రిమాండులో ఉంటున్నారు.