: 2019లోనే కాదు, 2090లో కూడా టీడీపీ అధికారంలోకి రాదు: హరీష్ రావు
2019లోనే కాదు, 2090లో కూడా టీడీపీ అధికారంలోకి రాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేది టీఆర్ఎస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంత పార్టీలను తెలంగాణ ప్రజలు ఆదరించరని ఆయన చెప్పారు.
తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ కాక తప్పదని హరీష్ రావు జోస్యం చెప్పారు. 2019లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.