: 'తెహల్కా' ఎడిటర్ కు మూడు వారాల బెయిల్
'తెహల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు మూడు వారాల పాటు బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. కొంతకాలం నుంచి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఆయన తల్లి శకుంతల తేజ్ పాల్ నిన్న (ఆదివారం) రాత్రి కన్నుమూశారు. దాంతో, తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలంటూ తేజ్ పాల్ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయడంతో వెంటనే బెయిల్ ఇచ్చింది. అత్యాచార ఆరోపణలతో తేజ్ పాల్ కొంతకాలంగా గోవా జైల్లో రిమాండులో ఉంటున్న సంగతి తెలిసిందే.