: చంద్రబాబు 2019లో అధికారంలోకి వస్తామంటున్నారు... అప్రమత్తంగా ఉండాలి: కోదండరాం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయింనంత మాత్రాన అంతా అయిపోలేదని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమం అస్తిత్వం కోసం చేసింది కాదని... వనరులపై అధికారం కోసం చేసిందని చెప్పారు. 2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారని... అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రచించిన 'తెలంగాణ జైత్రయాత్ర' పుస్తకాన్ని హైదరాబాదులో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి అంటే భవనాలు నిర్మించడం కాదని... ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమని చెప్పారు.