: ధనుష్, అక్షర క్రమశిక్షణ కలిగిన నటులు: అమితాబ్


తమిళ నటులు ధనుష్, అక్షర ఎంతో క్రమశిక్షణ కలిగిన వారని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. పేరు ఇంకా ఖరారు కాని ఆర్. బాల్కి (బాలకృష్ణన్) చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారు. ఇందులో ధనుష్, అక్షర హాసన్ తదితరులు కూడా అమితాబ్ తో తెరను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని ఊటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ధనుష్, అక్షర ప్రతిరోజూ తనతో కలసి పనిచేస్తున్నారని చెబుతూ, వారి పనితీరు, క్రమశిక్షణను అమితాబ్ మెచ్చుకుంటూ తన బ్లాగులో రాశారు.

  • Loading...

More Telugu News