: అందాల నటి రేఖ... ఇప్పటికీ కుర్రహీరోయిన్లతో పోటీపడుతోంది!
అందాల నటి రేఖ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. 40 ఏళ్ల నుంచి సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. 60 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ తరగని అందంతో కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోంది రేఖ. రేఖ కెరీర్ లో ‘మిస్టర్ నట్వర్ లాల్’, ‘ఉమ్రావో జాన్’, ‘సిల్ సిలా’... ఇలా అనేక హిట్ సినిమాలున్నాయి.
బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ నిర్వహిస్తున్న ‘సెలబ్రేట్ సినిమా’ ఉత్సవంలో పాల్గొన్న సందర్భంగా రేఖ తన జీవితంపైన, తన కెరీర్ పైన తన అభిప్రాయాలను వెల్లడించింది. 1966లో బాలనటిగా తెరంగేట్రం చేసిన రేఖ కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయాలున్నాయి. ఉమ్రావో జాన్ సినిమాకు ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. తనకు ఇప్పటికీ సినిమాల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయని, వాటిని తాను ఆశీర్వచనంలా భావిస్తున్నానని రేఖ చెప్పంది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫితూర్’ సినిమాలో రేఖ నటిస్తున్నారు.