: రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదం... మంత్రితో పాటు మరో ఇద్దరి మృతి
కాపలా లేని లెవెల్ క్రాసింగ్ మరో ముగ్గురు ప్రాణాలను బలిగొంది. అయితే, ఈసారి మరణించింది సామాన్య పౌరులు కాదు... సాక్షాత్తు మంత్రి. ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి సతాయిరామ్ ప్రయాణిస్తున్న వాహనం లెవెల్ క్రాసింగ్ ను దాటుతున్నప్పుడు అవతలి నుంచి వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. దాంతో మంత్రితో పాటు ఆయన వాహన డ్రైవర్, వాహనంలో ఉన్న మరొకరు కూడా అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు.
గడచిన మూడేళ్లలో కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్ ల వద్ద జరిగిన ప్రమాదాల్లో 200 మందికి పైగా మరణించారు. దేశవ్యాప్తంగా సుమారు 12,500 కాపలా లేని లెవెల్ క్రాసింగ్ లు ఉన్నాయి. వీటి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.