: అమిత్ షా, జైట్లీలతో మోడీ చర్చలు


ప్రధాని కాబోతున్న నరేంద్రమోడీ తనకు అత్యంత సన్నిహితుడైన అమిత్ షాతోపాటు, బీజేపీ సినియర్ నేత అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న గుజరాత్ భవన్ లో వీరితో చర్చలు జరుపుతున్నారు. వీరిద్దరికీ మోడీ మంత్రివర్గంలో కీలక మంత్రిత్వశాఖలు దక్కుతాయని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మంత్రివర్గ ఏర్పాటుపైనే చర్చలు సాగుతున్నట్లు సమాచారం. మరోవైపు మోడీని బీజేపీ యూపీ నేత కల్యాణ్ సింగ్ కూడా కలవనున్నారు. అలాగే ఎన్డీయేలో భాగస్వామ్యపక్షాలైన శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే, టీడీపీ నేతలతోనూ మోడీ సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News