: ఓటమి కారణాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విశ్లేషిస్తోంది: మనీష్ తివారీ


రాజీనామాలు సమర్పించడం వలన సమస్యలకు పరిష్కారం లభించదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో పార్టీ నేతలు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు సమర్పించడంపై మనీష్ స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాన్ని ధారపోసిన వాళ్లు పార్టీలో ఉన్నారనీ, రాజీనామాలతో సమస్యలు పరిష్కారం కావని మనీష్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓటమికి కుంగిపోకూడదనీ అన్నారు. ఓటమి కారణాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విశ్లేషిస్తోందని, దీనిపై సీడబ్ల్యూసీ తుది నిర్ణయానికి వస్తుందని మనీష్ తివారీ చెప్పారు.

  • Loading...

More Telugu News