: హోంశాఖపై రాజ్ నాథ్ కన్ను.. అధ్యక్షుడిగా ఉండాలంటున్న ఆర్ఎస్ఎస్
బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు సంకట స్థితి ఎదురైంది. మోడీ ప్రభుత్వంలో హోంశాఖ తీసుకోవాలని ఆయన ఆశ పడుతుంటే... పార్టీ అధ్యక్షుడిగానే ఉండాలని ఆర్ఎస్ఎస్ లోని ఓ వర్గం కోరుతోంది. కీలకమైన నేతలు ప్రభుత్వంలోకి వెళుతున్నందున పార్టీని బలంగా నడిపించాలంటే రాజ్ నాథ్ సింగ్ లాంటి వారు అధ్యక్షుడిగా ఉంటేనే మంచిదని ఆర్ఎస్ఎస్ నేతల వాదన. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ ఆశ తీరుతుందా? లేదా? అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలిపోనుంది.