: భవిష్యత్ లో పవన్ తో కలిసి పనిచేస్తా: జగ్గారెడ్డి


తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ నేత జగ్గారెడ్డి తన రూటు మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నేడు స్వయంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పవన్ సిద్ధాంతాలు తనకు నచ్చాయని చెప్పారు. భవిష్యత్ లో ఆయనతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. అయితే, ఏ విధంగా పనిచేసేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. అంతేగాక జనసేన పార్టీలో చేరేది, లేనిది త్వరలో చెబుతానన్నారు.

  • Loading...

More Telugu News