: సినిమా కథలు ఇక్కడే రాస్తా: రత్నంబాబు
తాను సినిమాలకు కథలను నాగార్జున సాగర్ లోనే రాస్తానని సినీ రచయిత డైమండ్ రత్నంబాబు తెలిపారు. సాగర్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... దిల్ రాజు బ్యానర్ లో 'పిల్లా నీవులేని జీవితం' సినిమాకు కథ అందించానని, అది ఈ నెల 30న విడుదల అవుతుందని తెలిపారు. సోలో సినిమాకు డైలాగులు, 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాకు కథ, డైలాగులను సాగర్ లోనే రాశానని వివరించారు.