: జగ్గారెడ్డి భావాలు నాకెంతో నచ్చాయి: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, జగ్గారెడ్డి భావాలు తనకెంతో నచ్చాయని చెప్పారు. ఒకవైపు తెలంగాణ వాదం గురించి మాట్లాడుతూనే, ఇరుప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం జగ్గారెడ్డి తపించారని కొనియాడారు. జగ్గారెడ్డి లాంటి వారు ప్రజలకు అవసరమని తెలిపారు. భవిష్యత్తులో జగ్గారెడ్డి, తాము కలసి పనిచేస్తామని చెప్పారు. జనసేన ద్వారా పనిచేయాలా? లేక ఇతర పార్టీలతో కలసి పనిచేయాలా? అనే విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు.