: హైదరాబాదు బయల్దేరిన చంద్రబాబు
టీడీపీ అధినేత, కాబోయే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా నారావారిపల్లె నుంచి హైదరాబాదు బయల్దేరారు. రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలసి నగరానికి రానున్నారు. అంతకుముందు తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత స్వగ్రామం నారావారిపల్లెలో తన తల్లిదండ్రులకు నివాళులర్పించారు.