: మామగారికి, తల్లిదండ్రులకు నివాళులు అర్పించిన చంద్రబాబు
నారావారిపల్లెలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు విగ్రహానికి కాబోయే సీమాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, నారా కర్జూరనాయుడుల సమాధుల వద్దకు చేరుకుని వారికి నివాళి అర్పించి... వారి ఆశీస్సులు తీసుకున్నారు. కాసేపట్లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి రేణిగుంట చేరుకుని... అక్కడ నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు.