: ప్రజాసేవ చేసేందుకే తిరుమలేశుడు నాకు పునర్జన్మ ఇచ్చాడు: చంద్రబాబు
వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులతోనే గతంలో జరిగిన అలిపిరి ప్రమాదం నుంచి తాను ప్రాణాలతో బయటపడ్డానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రజాసేవ చేసేందుకు స్వామి వారు తనకు పునర్జన్మను ప్రసాదించారని చెప్పారు. సీమాంధ్రను పునాదుల నుంచి నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు? ఎక్కడ? అనేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.