: నా చదువుకు రామలింగరాజు ఫీజు కట్టారనేది అవాస్తవం: నారా లోకేష్


టీడీపీ అధనేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అమెరికాలో చదువుకునేటప్పుడు... అతని ఫీజులను సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజు కట్టారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక టీవీ చానెల్ లో నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

విదేశాల్లో చాలా యూనివర్సిటీల్లో డొనేషన్లు కట్టి చదువుకోవచ్చని... కానీ, స్టాన్ ఫోర్డ్ లాంటి యూనివర్శిటీలో సీటు రావాలంటే సామాన్యమైన విషయం కాదని తెలిపారు. తాను సాధించిన స్కోర్ల వల్లే తనకు సీటు వచ్చిందని చెప్పారు. తనకు అప్పటికే హెరిటేజ్ లో షేర్లు ఉన్నాయని... తనకు కంపెనీ తరపున వచ్చిన డివిడెండ్లతోనే ఫీజు కట్టుకున్నానని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన వారు... వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News