: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని జూపల్లిలో రీపోలింగ్ ప్రారంభం
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని జూపల్లికి చెందిన 119 బూత్ లో రీపోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో అక్కడి ఈవీఎం మొరాయించడంతో కల్వకుర్తి అసెంబ్లీ ఫలితాన్ని చివరి నిమిషంలో నిలిపివేసిన సంగతి తెలిసిందే.