: దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పిన మాట వాస్తవమే!: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్


గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పిన మాట వాస్తవమేనని టీఆర్ఎస్ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అంగీకరించారు. అయితే ఇప్పుడున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే అది కేసీఆర్ కే సాధ్యమని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నామని ఆయన అన్నారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. అందుకే దళితులు టీఆర్ఎస్ కు పట్టం కట్టారని ఆయన చెప్పారు. దళితుల కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని ఈశ్వర్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News