: ఈ చిట్టి రోబో మన ఆలోచనల్ని పసిగడుతుంది


రోబో చిత్రంలో సైంటిస్టు వశీ తయారుచేసే రోబో పేరు చిట్టి. కేవలం చెప్పిన పనిచేసేలా రూపొందించిన రోబోకు 'ఆలోచించే' నేర్పును కూడా జతకలపడం.. దానివల్ల మొత్తం సైంటిస్టు వశీకర్‌ సొంత జీవితంతో పాటూ ప్రపంచం కూడా గందరగోళం అయిపోవడం అంతా మనం ఆ చిత్రంలో చూశాం. ఇప్పుడు బెంగళూరుకు చెందిన రామమూర్తి అనే మరో యువ సైంటిస్టు మనిషి ఆలోచనల్ని పసిగట్టి ప్రతిస్పందించగల ఓ చిట్టి రోబోను తయారుచేశాడు.

లండన్‌ ఎడిన్‌బర్గ్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మాటిక్స్‌లో పనిచేస్తున్న రామమూర్తి మనిషి ఆలోచన పసిగట్టి స్పందించే రోబోల రూపకల్పనకు ఏళ్ల తరబడి శ్రమించాడు. ఎడిన్‌బరోలో జరిగే సైన్స్‌ ఫెస్టివల్‌ కోసం రూపొందించిన ఈ రోబోలను త్వరలో సాకర్‌ కూడా ఆడేలా డెవలప్‌ చేస్తారట. 

రాక్‌`సిజర్స్‌` పేపర్‌ అంటూ కాన్వెంటు పిల్లలు ఇంటికి వచ్చాక కూడా సరదాగా ఆటలాడుతూ ఉంటారు. అలాంటి ఆటలను కూడా ఈ రామమూర్తి మేడ్‌ 'చిట్టి' ఆడుతాడు. మన ఆలోచన పసిగట్టి.. తను స్పందించేలా దీనికి డివైజెస్‌ అమర్చారు. రాక్‌ సిజర్స్‌ పేపర్‌ ఆడుదాం రమ్మంటూ ఇంటికి రాగానే... కాన్వెంటుకెళ్లే అమ్మాయి గొడవ చేస్తోందా.. ఓ బుల్లి రామమూర్తి రోబోను కొనిస్తే సరి.

  • Loading...

More Telugu News