: పోలింగ్ పెరిగింది... కలెక్టర్ ఆశయం నెరవేరింది
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగాలని ఆకాంక్షించిన మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆశయం నెరవేరింది. ఆమె తలపెట్టిన ఓటరు పండుగ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. మెదక్ జిల్లాలో 92 శాతానికి పైగా పోలింగ్ జరిగిన 101 గ్రామాలను గుర్తించారు. ఆయా గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరి ఓటరు స్లిప్పులను డ్రా తీసి ఆరు మంది విజేతలను నిర్ణయించారు. జిల్లాలోని చిన్నకోడూరు మండలం మాటిండ్లకు చెందిన లచ్చమ్మ అనే మహిళ నానో కారు గెలుచుకున్నారు. మిగతా ఐదుగురికి ద్విచక్రవాహనం, టీవీ, ఫ్రిజ్, మోటారు పంపు సెట్, ఇన్వర్టర్ లను కానుకలుగా ఇచ్చి... కలెక్టర్ మాట నిలబెట్టుకున్నారు.