: 21న ఇడుపులపాయలో వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష భేటీ


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని ఈ నెల 21వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో నిర్వహించనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష నేతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను, కార్యక్రమాలను కూడా చర్చిస్తారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో జగన్ భేటీ అవుతారు. ముందుగా రాజమండ్రిలో ఈ భేటీ జరుగుతుందని అనుకున్నారు. అయితే, ఇవాళ వేదికను ఇడుపులపాయకు మార్చినట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News