: జయలలితకు ఫోన్ చేసి అభినందించిన నరేంద్ర మోడీ
తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలకు అన్నా డీఎంకే 37 స్థానాలు గెలుచుకున్నందుకు జయలలితకు ఫోన్ చేసిన మోడీ అభినందనలు తెలిపారు. కేంద్రప్రభుత్వం నుంచి తమిళనాడు ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఆయన జయలలితకు హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బీజేపీ ఘనవిజయం సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ జయలలిత లేఖ రాశారు. ఆ లేఖకు స్పందిస్తూ మోడీ ఇవాళ ఆమెతో ఫోన్ లో మాట్లాడారు.