: ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయం: ఏఏపీ నేత మనీష్ సిసోడియా
ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) సీనియర్ నేత మనీష్ సిసోడియా మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలుండగా, బీజేపీకి 31 సీట్లు ఉండేవి. అయితే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికయ్యారు.