: బిజూ జనతాదళ్ శాసనసభా పక్ష నేతగా నవీన్ పట్నాయక్
బీజేడీ శాసనసభా పక్ష నేతగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. లోక్ సభ ఎన్నికలతో పాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ సారధ్యంలోని అధికార బీజేడీ వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకుని విజయఢంకా మోగించింది. మొత్తం 147 సీట్లకు గానూ 115 స్థానాల్లో బీజేడీ గెలుపొందింది. కాంగ్రెస్ 18, బీజేపీ 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. సమతా క్రాంతి దళ్ ఒక్క సీటు గెలుచుకోగా, రెండు చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు.