: రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన పీఏ సంగ్మా


నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత, మాజీ లోక్ సభ స్పీకర్ పీఏ సంగ్మా బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. సంగ్మా పార్లమెంటు ఎన్నికల్లో తొమ్మిదోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. కేబినెట్ కూర్పుకు సంబంధించిన వ్యవహారాలు ఊపందుకున్న తరుణంలో రాజ్ నాథ్ ను సంగ్మా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ లో చోటు కల్పించాలని రాజ్ నాథ్ ను సంగ్మా కోరినట్టు వార్తలు వెలువడ్డాయి.

షిల్లాంగ్ లోని తురా లోక్ సభ నియోజకవర్గం నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విన్సెంట్ హెచ్ పాలాపై 40 వేలకు పైగా మెజార్టీతో సంగ్మా గెలుపొందారు. 1972 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు లోక్ సభ అభ్యర్థిగా సంగ్మా విజయం సాధించారు. 1989, 2009 ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు.

  • Loading...

More Telugu News